సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు!!..

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు!!

మెదక్ జిల్లా నర్సాపూర్ సీఎం కేసీఆర్ ప్రచార సభలో బుల్లెట్లు కలకలం సృష్టిస్తున్నాయి.

ఈ సభలో అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు…
మెదక్ జిల్లా నర్సాపూర్ లో సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేపింది.ప్రెస్ గ్యాలరీలో కి గుర్తు తెలియని వ్యక్తి విలేఖరీ నీ అంటూ సభా ప్రాంగణం లోకి వస్తూoడాగా పోలీసులు ఆ వ్యక్తిని ఆపి ఐడి కార్డు అడుగగా సదరు వ్యక్తి తన జేబులో నీ పర్సు తీయగా అందులో 2 బుల్లెట్ల ఉన్నట్లు తెలుస్తుంది.వెంటనే అతన్ని పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది..

సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి. కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండగా అస్లాం అనే యువకుడు అనుమానాస్పందంగా తిరుగుతుండడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. అస్లాం నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.