సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం..!!!

ప్రగతిభవన్‌లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ సూచించారు. కాగా ఐటీ, ఈడీ దాడులతో టీఆర్‌ఎస్‌ నేతల్లో అలజడి మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం అయ్యారు. మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది..