*ముందస్తు పై తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్*
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యేలు 2022-11-15 సమావేశం..
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనససభపక్షం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి ఫాంహౌజ్ ట్రాప్డ్ ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంటే వచ్చారు. కాగా, ఈ సమావేశంలో మునుగోడులో పనిచేసిన నేతలను అభినందిస్తూ తీర్మానం చేశారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం విస్తృతమైన నేపథ్యంలో సొంత పార్టీ వివరాలు బయటకు లీక్ కాకుండా సమావేశాల హాల్‌లోకి మొబైల్ ఫోన్లను నిరాకరించారు…