రేపు దిల్లీలో జరిగే నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. బీజేపీ ప్రభుత్వంపై ఇక యుద్ధం తప్పదు…సీఎం కేసీఆర్..

ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి యెడల నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి.. నేను నా నిరసన ప్రధానమంత్రికి నిరసనను ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇక యుద్ధం తప్పదన్నారు సీఎం కేసీఆర్..నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది. ఐనా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు….
దేశంలో ఎప్పుడు లేనటు వంటి పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ వ్యక్తం చేశారు. విద్వేషాన్ని అసహనాన్ని పెంచుతున్న ఎన్డీఏ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనట్టుగా 13 నెలల పాటు రాజధానిలో ఆందోళన చేసి 800 మంది ప్రాణాలు కోల్పోతే.. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతుల పెట్టుబడి రెట్టింపు అయిందే తప్ప ఆదాయం డబుల్ కాలేదని విమర్శించారు. తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఇక దేశ రాజధానిలో మంచి నీటి కటకట ఉందంటే నీతి ఆయోగ్ ఏం చేస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు….

బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిందన్నారు. నీతి ఆయోగ్‌తో దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించామని చెప్పారు. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ నిరర్దక సంస్థగా మారిందని విమర్శించారు…

బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది జరిగిందని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులు 13 నెలల పాటు పోరాటం చేశారని గుర్తుచేశారు. రైతులు పోరాటం చేయకముందే.. 13 రోజుల్లో చట్టాలను రద్దు చేసి ఉండొచ్చు కదా అని కామెంట్ చేశారు. దేశంలో ద్వేషం, అసహనం పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రధాని చేసిన ఏ వాగ్దానం నెరవేరడం లేదన్నారు. నీతి ఆయోగ్‌లో మేథోమథనానికి బదులు.. ప్రధాని భజన బృందంగా మారిందని విమర్శించారు. రైతుల ఆదాయం పెరగలేదని.. ఆదాయం మాత్రం రెట్టింపు అయిందన్నారు. ..

అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తూ.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణపై బీజేపీ సవతి ప్రేమ కనపరుస్తుందని.. మనకి అవార్డులు, పొగడ్తలు మాత్రమే ఉంటాయి.. కానీ రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు మాత్రం ఇవ్వరు. 1లక్ష 90వేల కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తే.. కేంద్రం నుంచి కేవలం 5వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రాల ప్రగతిని కేంద్రం పెద్దల తీరు దెబ్బతీస్తోంది. ఒక చిన్న ట్విట్ తో రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఎగ్గొడుతారా.. 14లక్షల కోట్లు సెస్ పేరుతో రాష్ట్రాలకు పంచాల్సిన పన్నులు కేంద్రం ఎగ్గొట్టింది అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర బీజేపీపై ఫైర్ అయ్యారు.