కేసీఆర్ ని పట్టుకోగలవా..టచ్ చేసి చూడు..కేసీఆర్ ను టచ్ చేసి బతుకుతావా.. సీఎం కేసీఆర్.. ఫైర్..

బండి సంజయ్ మాటలు పట్టుకొని వరి పంట వేస్తే మోసపోతాం….ఏడాదిగా రైతులు ధర్నా చేస్తున్నారు..రైతులను తొక్కి చంపుతున్నారు..
ఇన్ని రోజులు వాళ్ళు తిట్టిన పడ్డాం.భరించాం..
అడ్డం పొడుగు మాట్లాడారు ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి నేనే ఇవాళ మాట్లాడుతున్న..ఏడేళ్లుగా మీకు కరెంట్ ఇచ్చిన వారెవరో, మిమ్మల్ని కాపాడింది ఎవరు మీకు తెలుసు ప్రజలు గమనించాలి..పెట్రోల్ డీజిల్ పై పచ్చి అబద్దాలు మాట్లాడింది కేంద్రం..సుంఖం కాకుండా సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు….లక్షల కోట్లు వసూలు చేస్తోంది కేంద్రం..*పెట్రోల్ డీజిల్ పై సెస్ ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు..బండి సంజయ్ పై సీఎం కేసీఆర్ ఫైర్…నన్ను జైలుకి పంపుతావ అంత ధైర్యం ఉందా అంత బలుపా బండి సంజయ్..
ఎవరు అనుకోని మాట్లాడుతున్నవ్
కేసీఆర్ ని పట్టుకోగలవా..టచ్ చేసి చూడు..కేసీఆర్ టచ్ చేసి బతుకుతావా.

ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోంది: కేసీఆర్‌

ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి చెప్పారని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. మిషన్‌ కాకతీయతో చెరువులను అద్భుతంగా తీర్చిదిదద్దుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.