దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సవాల్…

R9TELUGUNEWS.COM.: దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టి జైల్లో వేస్తామంటూ హెచ్చరిస్తున్నారని, జైలంటే దొంగలకు భయమని, తనకేం భయం లేదన్నారు. దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వాళ్లందా మోదీ దోస్తులేనన్నారు. రఫేల్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని, కేంద్ర అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. మోదీవన్నీ గోల్ మాల్ మాటలేనన్నారు. రఫెల్ కుంభకోణం బయటికి రావాలని, అందులో దొంగలు బయటపడాలన్నారు. రఫెల్ పై మాట్లాడితే ఆయనపై ఎదురుదాటి చేశారని తెలిపారు.