ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిచ్చారు. చినజీయర్ స్వామితో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. దయచేసి అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని కోరారు. మరోవైపు ‘‘ప్రశాంత్ కిశోర్ తనకు ఎనిమిదేళ్లుగా మంచి మిత్రుడు. దేశ రాజకీయాలపై ఆయనకు అవగాహన ఉంది. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నా.. నా ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిశోర్ వచ్చి పనిచేస్తున్నారు అని కేసీఆర్ వివరించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.