కేంద్రం తెలంగాణపై వివక్ష మార్చుకోకపోతే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాం..
పంజాబ్ కు ఒక నీతి..తెలంగాణ కు మరో నీతి….
తెగించి పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నాం,,అదే స్ఫూర్తి తో హక్కుల కాపాడుకోలేమా….
కేంద్రం తీరుపై టీఆర్ఎస్ఎల్పీలో సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్…సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం స్థాయిలో కేంద్రంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం వినకపోతే యాక్షన్ ఓరియంటెడ్‌గా తమ పోరాటం ఉంటుందని చెప్పారు…
ధాన్యం సేకరణ విషయంపై కేంద్రంతో చర్చించేందుకు రేపు మంత్రుల బృందం, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి, మెమోరాండం అందజేస్తారన్నారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం..సమ్మతించని పక్షంలో ఎంతని పోరాటానికైనా సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు.‘ఈ పోరాటం ఆషామాషీగా ఉండదు. మాటలు, పేపర్ స్టేట్మెంట్లుగా ఉండదు..యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య…..
పంజాబ్ నుండి కొనుగోలు...
యాసంగిలో వరిని పంజాబ్ నుంచి కొన్నట్లే… తెలంగాణ నుంచి కూడా కేంద్రమే కొనుగోలు చేయాలి. మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారు. రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు. 30 లక్షల ఎకరాల్లో వచ్చిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతటికీ ఒకే పాలసీ ఉండాలి అని కేసీఆర్ అన్నారు…ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం సీఎం కేసీఆర్…తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండెనో.. అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమెట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇందులో భాగంగా మంత్రులు, ఎంపీలు రేపు విజ్ఞప్తు చేయబోతున్నరో..అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జడ్పీలు, మున్సిపల్, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీల్లో తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తాం. అప్పటికే తీసుకుంటారని భావిస్తున్నాం. అలా కానీ పక్షంలో వందకు వందశాతం ఉద్యమిస్తాం. ఎంత వరకైనా పోరాడుతాం. గతంలో పంజాబ్ రైతులను ఏడిపించిన అనేక కేంద్ర ప్రభుత్వాలు.. చాలా పోరాటాల తర్వాత వందశాతం ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ సమాంతరంగా పంజాబ్ మాదిరిగా వందశాతం ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు పోరాటం చేస్తాం. దాన్ని వదిలే ప్రశ్నే లేదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.