నేడు సూర్యాపేట జిల్లాలో కేసీఆర్‌ పర్యటన.. షెడ్యూల్..!.

CM KCR TOUR SCHEDULE..*
ముస్తాబైన సూర్యాపేట.. సీఎం కేసీఆర్ రాక కోసం వేచి చూస్తున్నా మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ అభిమానులు…..

ఇంకా ఏమి వరాలు కురిపిస్తారని ఆసక్తిగా చూస్తున్న సూర్యాపేట జిల్లా వాసులు,.

సభాస్థలితో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి..
దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి పలువురు ఎమ్మెల్సీలు. ఎమ్మెల్యేలు..

సీఎం కేసీఆర్ జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న భవనాలను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న కార్యాలయాలను నేడు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు రాజకీయనేతలు ఇప్పటికే తగిన ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలు తీసుకున్నారు..
అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4.50 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో హైదరాబాద్ బయల్దేరనున్నారు.
వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు..

*-10.35am ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు పయనం.*
*-10.45am బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో పయనం.*
*-11.15am SV కాలేజీ లోని హెలిప్యాడ్ రాక.*
*-11.25am గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భవన సముదాయం ప్రారంభోత్సవం.*
*12 గంటలకు.. ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభం.*
*-12.25pm జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభం.*
*-12.50pm BRS పార్టీ భవనం ప్రారంభోత్సవం.*
*-1.25pm ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం.*
అనంతరం భోజన విరామం.
*-3pm పబ్లిక్ మీటింగ్ కు హాజరు..
*-4.50pm తిరిగి SV కాలేజీ హెలిప్యాడ్ నుంచి బేగంపేట్ కు పయనం..