ధరణి ప్రారంభించి రైతులకు న్యాయం చేసినం.విఆర్వో లను ఉత్తగనే తీసేయలె.ఒకరి భూమి మరొకరికి రాస్తుంటే ఉంచుతమా?… సీఎం కేసీఆర్…

సూర్యాపేట జిల్లా లో కేసీఆర్ టూర్..

…. సూర్యాపేట కళాభారతి నిర్మాణానికి 25 కోట్లు మంజూరు…జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి 10 లక్షల నిధులు… జిల్లాలో మున్సిపాలిటీలకు 25 కోట్లు..సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్దికి కి 50 కోట్ల కేటాయింపు..మానవాభివృద్ది సూచికలో రాష్ట్రం మొదటి స్థానం లో ఉంది..వంద కోట్లతో జిల్లాలో పరిపాలనా భవనాలను నిర్మించుకున్నాం..
జిల్లాకో మెడికల్ కాలేజీ దేశంలో ఏ రాష్ట్రం లోనూ లేదు..ఎన్నికల వేళ కొత్త బిచ్చగాళ్లు వస్తరు..ధరణి ప్రారంభించి రైతులకు న్యాయం చేసినం.విఆర్వో లను ఉత్తగనే తీసేయలె.ఒకరి భూమి మరొకరికి రాస్తుంటే ఉంచుతమా?మండల కేంద్రంలో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా చేసినం…కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలో విద్యుత్ కోతలు మొదలైనయ్…ధరణి తీసేస్తే రైతుబంధు,రుణమాఫీ ఎలా సాధ్యం?..నీ భూమి పై నీకే అధికారం ఉంది…సిఎంకు మంత్రులకు,కలెక్టర్లకు లేదు.నీ బొటన వేలుకే ఉంది…మా దగ్గర అధికారాన్ని మీకు బదలాయించినం…తెలంగాణలో పండే వడ్లను తరలించడానికి లారీలు సరిపోవట్లేదు…హుజూర్ నగర్ ని పెద్ద పెద్ద మొనగాళ్లే పట్టించుకోలె…సైదిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక సాగర్ లైనింగ్ పనులు మొదలైనయ్….మద్యవర్తుల అవసరం లేకుండానే రైతుబంధు,రైతుభీమా రైతుల ఖాతాలో వేస్తున్నం..ఫించన్లు ఎంత పెంచాలో త్వరలో చెప్తా.. మూసీ మురికి నీళ్ల నుండి సూర్యాపేటకు భగీరధ నీళ్లు వస్తున్నయ్.సర్పంచ్ లకు గతంలో కాకుండా జిపిలకు అన్నీ ప్రభుత్వమే ఇస్తోంది..అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 30 వేల కోట్లతో ఇక్కడే ఏర్పాటు చేసినం…ఉమ్మడి జిల్లాల్లో 12 కు 12 సీట్లు మనమే గెలవబోతున్నం…

20 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గులాబీ తోరణాలను ఏర్పాటు చేశారు. ఇసుక వేస్తే రాలనంతగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. సభా ప్రాంగణం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ప్రజలు రోడ్లపై నిల్చుండి సీఎం ప్రసంగాన్ని విన్నారు.

*అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన సిఎం*

ప్రజలకు పాలనను మరింత గా చేరువ చేసేందుకు నూతన జిల్లా లను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదే రీతిన నూతన పాలనా సౌథాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్కెట్‌లో కాసేపు కలియతిరిగి దాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా నూతన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం లో జెండా ఎగురవేశారు. జిల్లా అధ్యక్షుడు ఎంపి,బడుగుల లింగయ్య యాదవ్ ను కుర్చీలో కూర్చో పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించారు. అక్కడ జిల్లా ఎస్పీ ఛాంబర్‌లో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను కూర్చొబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం చేశారు. కలెక్టర్‌ వెంకట్రావు ను కుర్చీలో కూర్చొబెట్టా రు. అనంతరం కలెక్టర్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం కావడమే ఒక చరిత్ర అన్నారు.
సూర్యాపేట చక్కగా అభివృద్ధి చెందిందన్న సిఎం 100 కోట్ల తో పరిపాలన భవనాలు ప్రారంభించుకున్న సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి, శాసన సభ్యులు
జిల్లా ప్రజలకు అభినందనలు తెలిపారు.ప్రపంచం లోనే మానవభివృద్ధిలో రాష్ట్రం గొప్ప స్థానం లో ఉండడం గర్వకారణం అన్నారు.
ఇంత అద్భుత కలెక్టరేట్ లు, పోలీస్ భవనాలు ఎక్కడా లేవు కనపడవు అన్నారు.కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ లు కూడా ఇంతలా లేవన్నారు.అందరి భాగస్వామ్యం తోనే ఇంతటి ప్రగతి సాధ్యం అయిందన్నారు.సమాజంలో ఆర్ధిక అసమానతలు, సాంఘిక అసమానతలు పోవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజలంతా సంతోషం గా జీవించే స్థితి కి రావాలి అన్నారు.
దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ స్టేట్ టాప్ ప్లేస్ లో ఉందన్నారు. అభివృద్ధికి గీటురాయిగా పరిగణించే తలసరి విద్యుత్ వినియోగంలో సైతం తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల కృషితో దేశంలోనే తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ గా ఉందన్నారు.అభివృద్ధి ఇంకా జరుగాల్సి ఉందన్న ముఖ్యమంత్రి, దానిని కొనసాగించడానికి ఉద్యోగులు మరింత గా శ్రమించాలని పిలుపు నిచ్చారు.ఇప్పటికే ఎక్స లెన్స్ దశకు చేరుకున్నాం మన్న సిఎం, ఇంతటితో ఆగిపోవద్దన్నారు.నెక్స్ట్ లెన్స్ కోసం ప్రయత్నం చేయాలి అని ఉద్యోగుల కు కేసీఆర్ పిలుపు నిచ్చారు.ఇవాళ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా బతుకుతున్నారన్న సిఎం దేశంలో ఎక్కడలేని విధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకువచ్చామని అన్నారు. ప్లోరోసిస్ తో సతమత మైన నల్లగొండ జిల్లా , రాష్ట్రాన్ని జీరో ఫ్లోరోసిస్ స్టేట్ గా స్టేట్ గా తెలంగాణ నిలిచిందన్నారు. ఇందులో దుషర్ల సత్యనారాయణ లాంటి ఎందరో పోరాటం ఉన్నదని కొనియాడారు. ప్రారంభోత్సవంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజన్‌కుమా ర్‌, ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్, మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి , ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జడ్పి చైర్మన్ దీపికా యుగంధర్, వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.