రేపు నల్గొండ జిల్లా, దామరచర్ల ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్….

నల్గొండ :

రేపు జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్…

దామరచర్ల వద్ద గల అల్ట్రా మేఘా పవర్ ప్లాంట్ ను పరిశీలించనున్న సీఎం…

సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొననున్న మంత్రి జగదీష్ రెడ్డి,పలువురు నేతలు…
…………………….
CM టూర్..
……రేపు….
ముఖ్యమంత్రి కేసీఆర్.. రేపు నల్గొండ జిల్లా, దామరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించడానికి వస్తున్న నేపథ్యంలో జెన్క్ అధికారులు,అదనపు కలెక్టర్ , RDO, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు… ప్లాంట్ ఆవరణలోనే హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు….విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తో, పాటు జెన్క్ ,ట్రాన్స్ కో cmd ప్రభాకర్ రావు ,ఇతర శాఖల అధికారులు BHEL అధికారులు,ముఖ్యమంత్రి గారి పర్యటన లో పాల్గొననున్నారు….2015లో మొదలైన పవర్ ప్లాంట్ పనులు 70 శాతంపైగా పూర్తి అయ్యాయి.. వచ్చే యేడు అక్టోబర్ లోగా
2 ప్లాంట్ లో మొదటి దశ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా జెన్కో సంస్థ పనులను జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నది..
5 వేల ఎకరాల్లో, 30 వేల కోట్ల వ్యయంతో ,
5 ప్లాంట్ లాల్లో, ఒక్కో ప్లాంట్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చొప్పున ,
మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం ఈ ప్లాంట్ ని నిర్మిస్తుంది…అయితే ప్లాంట్ లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించడంతో పాటు, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా , పనులను వేగిరం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు…ఈ మేరకు అధికారులు అన్ని రకాల నివేదికలను సిద్ధం చేశారు…దేశంలోనే ప్రభుత్వ
రంగo లో నిర్మిస్తున్న అతి పెద్ద పవర్ ప్లాంట్ కావడంతో యాదాద్రి పవర్ ప్లాంట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది…. యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయితే రాష్ట్ర అవసరాలకు పోను ,మిగులు విద్యుత్ రాష్ట్రం గా తెలంగాణ నిలవనుంది…ఇప్పటికే విద్యుత్ రంగం లో ఊహకందని విజయాన్ని సొంతం చేసుకొని,,అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ… ఇప్పుడు తెలంగాణ కే కాంతి పుంజంలా నిలుస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు అనుకున్న సమయనికి పూర్తి అవుతుండటంతో సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి……….