సెప్టెంబర్ 8న భూపాలపల్లికి సీఎం కేసీఆర్
సెప్టెంబర్ 8న భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాలలను సీఎం ప్రారంభం చేస్తారన్నారు. అలాగే మంజూర్ నగర్లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు.