తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటన..

*యాదాద్రికి చేరుకున్న సీఎం* ..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తున్నారు…..
R9TELUGUNEWS.COM: ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కొండ కింద ఉత్తర దిశలో రూ.105 కోట్లతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా…

భువనగిరి లో తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి,తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసినా సీఎం కేసీఆర్, ..

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అత్యాధునికంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ ను ప్రారంభించి,,.,,
కలెక్టర్ పమేలా సత్పతి ని కలెక్టర్ చైర్ లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్….కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్……

ఈ సందర్భంగా ఆయన ప్రెసిడెన్షియల్‌ సూట్స్, వీవీఐపీ కాటేజెస్‌ను ప్రారంభించారు. అనంతరం యాగశాలను పరిశీలించనున్నారు. యాదాద్రి పర్యటనలో తెరాస జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించి కలెక్టరేట్‌ పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు…