తెరాస విజయగర్జన సభ సహా, కేసీఆర్ టూర్ రద్దు…..!

అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌.
బహిరంగ సభలు, రాజకీయ సభకు అనుమతి లేదు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌.
29న హనుమకొండలో జరగాల్సిన తెరాస విజయగర్జన సభ సహా రేపటి కేసీఆర్ పర్యటన రద్దు..
R9TELUGUNEWS.COM.: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌ నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇచ్చిన మార్గదర్శకాలే వర్తిస్తాయని తెలిపారు. రాజకీయ సమావేశాలకు కూడా అనుమతి లేదన్నారు. డిసెంబరు 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ జరుగుతుందని శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ఎన్నిక ల నియమావళి ఇవాళ్టి నుంచి అమల్లోకి రావడంతో ఈనెల 29న హనుమకొండలో జరగాల్సిన తెరాస విజయగర్జన సభ వాయిదా పడింది…