రాష్ట్రపతి ఎన్నికలు..ఓటు వేసిన సీఎం కేసీఆర్..

రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఓటు వేశారు. సోమవారం ఉదయం నుండి తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న భారత రాష్ట్రపతి ఎన్నికలో మధ్యాహ్నం 1 గంట వరకు 110 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి ఎమ్మెల్యేగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటు వేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఏఐఎంఐఎంలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు…టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూడు బస్సుల్లో అసెంబ్లీ ప్రాంగణానికి రాగ.. అంతకుమునుపే తెలంగాణ భవన్‌లో ఒక రౌండ్ మాక్ పోలింగ్ జరిగింది…