వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్…..ప్రజ‌ల‌కు మ‌త పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చ‌ర్యలు చేసే ప్రయ‌త్నంచేస్తున్నరు..

వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యార‌ని.. దేశాన్ని ఆగం ప‌ట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజ‌ల‌కు మ‌త పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చ‌ర్యలు చేసే ప్రయ‌త్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైత‌న్యం ఉన్న గ‌డ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండ‌గా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్.. మ‌నంద‌రం ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు.. కులం, మ‌తం, జాతి లేకుండా ప్రజ‌లంతా బాగుప‌డాలని ఆకాక్షించారు.అవహేళనలను తట్టుకొని రాష్ట్రం సాధించుకున్నాం.. రాష్ట్రం సాధించుకున్న ప్రతిఫలం కళ్లముందు కనిపిస్తుందన్నారు కేసీఆర్.. ఒకప్పుడు ఒక మెడికల్ కళాశాల కూడా లేదు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల సాధించుకున్నాం.. హైదరాబాద్‌ నుండి గద్వాల.. వరకు ఎక్కడ చూసినా పచ్చదనం ఉందన్నారు.. పాలమూరు జిల్లా పాలుగారుతోంది.. పాలమూరు పూర్తి చేస్తే అద్భుతమైన వజ్రపు తునక అవుతుందన్నారు.. 15 లక్షల మంది వలస పోయే వారు.. ఇప్పుడు రాయచూరు, కర్నూలు నుండి వలస వస్తున్నారన్న ఆయన.. 11 జిల్లాల నుండి మన వలస కూలీలు మన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారని తెలిపారు.. నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరుపెట్టాను.. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇచ్చానన్న ఆయన.. ఈసారి నిరంజన్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, ఈ సందర్భంగా పాలమూరు సాధించిన ప్రగతిపై పాట పాడారు సీఎం కేసీఆర్.. పట్టుబడితే, జట్టు గడితే బంగారు తెలంగాణ సాధ్యమైంది.. దేశం కూడా ఇట్ల అభివృద్ధి కావాలన్నారు.. ఇక, ప్రజలకు మత పిచ్చి లేపుతున్నారు.. అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్న కేసీఆర్.. దేశం కోసం పోరాటానికి పోదామా అంటూ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మంచిని పెంచేందుకు ముందుకు పోయేందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను.. మత పిచ్చి, కుల పిచ్చి వల్ల సమాజానికి నష్టం అని.. ఈ దేశంలో మంచిని కాపాడ‌టానికి.. మంచిని పెంచ‌డానికి అవ‌స‌ర‌మైతే నా ప్రాణాన్ని కూడా ధార‌పోయ‌డానికి సిద్ధంగా ఉన్నా. అదే ప‌ద్ధతిలో ముందుకు వెళ్లాలని.. బుద్ధి త‌క్కువ పార్టీలు, వెద‌వ‌లు.. వాళ్ల చిల్లర రాజ‌కీయాల కోసం దేశాన్నే, భార‌త జాతినే బ‌లి పెట్టేటువంటి విష ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. చైత‌న్యవంత‌మైన తెలంగాణ మేధావులు.. ద‌య‌చేసి దాన్ని తిప్పి కొట్టాలి. భ‌యంక‌ర‌మైన‌టువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్ మ‌న‌కు రాకుండా చూసుకోవాలని సూచించారు..