సీఎం మమతాబెనర్జీకి స్వల్పగాయం..

పశ్చిమ బెంగాల్:జనవరి 24
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ బుధవారం గాయపడ్డారు. ఆమె బుర్ద్వాన్‌లో సమావేశం ముగించుకుని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా మమతా బెనర్జీ స్వల్పంగా గాయపడ్డారు.

సభాస్థలి నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా మమత కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసినట్లు సమాచారం. ఈ కుదుపు వల్ల కారులో ఉన్న సీఎం మమత నుదిటిపై స్వల్ప గాయమైంది.

కాసేపటికి కోలుకున్న ఆమె అదే కారులో కోల్‌కతాకు బయలుదేరారు…