పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించాలి : సీఎం రేవంత్.

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

గత ఏడాది జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈసారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు.

పరీక్ష పూర్తయ్యేంత వరకు అవసరమైతే జామర్లు ఏర్పాటు చేసి, ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ చేయించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బంది, విద్యార్థులు ఎవరికీ ఫోన్లు అందుబా టులో లేకుండా చూడను న్నారు.

పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్లకుం డా, మాస్ కాపీయింగ్ జర గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.

ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తర గతి పరీక్షలు జరగను న్నాయి.