కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచన చేసిన వారికి తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారు… CM రేవంత్ రెడ్డి..

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచన చేసిన వారికి తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారని* ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. *తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని.. ఐదేళ్ల సుస్థిర పాలన అందించే బాధ్యత మాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతల మాటల్లో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని విమర్శించారు.