నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ..

*వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.. వారితో పాటు పలువురు మంత్రులు కూడా ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికలపై అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. దీంతో పాటు మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్‌లతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం కానుండగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.