ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ హైదరాబాద్ సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి..

పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు(Old City Metro Rail Project) శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మాట్లాడుతూ.. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. హైదరాబాద్ నగర(Hyderabad City) ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందన్నారు…

హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృతః నిశ్చయం తో ఉన్నం..

ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, హైదరాబాద్ అభివృద్ధి పై ఎప్పుడైనా కట్టుబడి ఉన్నాం..

*ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ హైదరాబాద్ సిటీ*

ఓల్డ్ సిటీ మెట్రో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాం

హైదరాబాద్ కు కృష్ణ,గోదావరి నీళ్ళు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ

నేను మా ఊరు వెళ్ళాలంటే పాత బస్తీ నుండే వస్తూ పోతు ఉంటాను

2050 వైబ్రెంట్ పేరుతో అభివృద్ది ప్లాన్ చేపడతాం..

*Mim ను ఓడించేందుకు నేను కూడా ప్రయత్నం చేశాను.

కానీ అసదుద్దీన్ MIM నిత్యం గెలుస్తూనే వస్తున్నారు.

రాజకీయాలు ఎన్నికల కోసమే, అభివృద్ది కోసం అందరం కలిసి పని చేస్తాం.

చంచల్ గూడా జైలు అక్కడ తొలగించి కేజీ టూ పీజీ కళాశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం

మేమే రాబోయే పదేళ్లు అధికారం లో ఉంటాము

హైదరాబాద్ అభివృద్ది పైన ప్రత్యేక దృష్టి పెడుతాం..

మేం కృషి చేస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్ తో కలిసి సందర్శించాం. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫెజ్-2 ను తీసుకొస్తున్నాం. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నాం. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ను(Hyderabad Metro) ఏర్పాటు చేయబోతున్నాం. చంచల్ గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు…