ట్యాక్స్ పేయర్స్ కు రైతు బంధు ఎందుకు?.. రేవంత్ రెడ్డి..

*రేవంత్ రెడ్డి చిట్ చాట్:*

“ట్యాక్స్ పేయర్స్ కు రైతు బంధు ఎందుకు? వ్యవసాయం చేసే వారికే రైతు బంధు ఇస్తాం.అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.మా కుటుంబంలో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది.
జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది.ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం.సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది.చర్యలు తీసుకుంటాం.మా పరిపాలన రిఫరెండంగా ఎన్నికలకు వెల్తాం.14 కు పైగా పార్లమెంటు సీట్లు గెలుస్తాం..
అన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ జరుపుతాం.
SIB మాజీ DSP ప్రణిత్ రావు వ్యవహారం పై సమగ్ర విచారణ జరుగుతుంది.జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నాం.రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది.కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేస్తే.వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం.RSP మా మిత్రుడు కాదు.నన్ను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదు.
సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా కేసీఆర్ చేసాడు.ఫైనల్ గా కాళేశ్వరంపై NDSA చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.మా ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో వారే చెప్పాలి.అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారు?దేశానికి ప్రధాని పెద్దన్నే కదా.
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు. అంతా బహిరంగమే.బీజేపీ నేతలు ప్రధానిని తప్పుదోవ పట్టించారు.కాళేశ్వరం పై 4 వారాల్లో నివేదిక ఇస్తే ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటాం.తుమ్మిడిహెట్టి నిర్మించి ఆదిలాబాద్ కు నీళ్లు ఇస్తాం.బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఓప్పందంతో టికెట్ ల ప్రకటన.మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?ఎల్లుండి సీఈసీ మీటింగ్ ఉంది.అదే రోజు అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు.”