సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య తీవ్ర వాగ్వాదం ..!!?

రాజ్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య గొడవ కలకలం రేపుతోంది. రాజ్ భవన్ లో బుధవారం కొత్త గవర్నర్ ప్రమాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొందరు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ప్రమాణం ముగిసి తిరిగివెళ్తున్నట్టు సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీఎం రేవంత్ రెడ్డితో తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆయనతో పాటు నడిచారు. ఇది జరుగుండగా చిన్నారెడ్డి మధ్యలో వచ్చి వారించే ప్రయత్నంచేశారు. దీంతో మాట్లాడొద్దంటూ ఆయనవైపు చాలా ఆగ్రహంతో తుమ్మల చేయి చూపించారు. ఈ లోగా మరికొందరు మంత్రులు అక్కడికి చేరుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోతోంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ఆయన నడుంపై చేయి వేసి కూల్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో అటువైపు వచ్చిన చీఫ్ సెక్రటరీ దగ్గరికి అంతా కలిసి వెళ్లారు. అక్కడ మరో ఐదు నిమిషాల పాటు గొడవ నడిచింది. చివరకు తుమ్మలను తన వాహనంలో ఎక్కించుకుని సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వీరి మధ్య ఏ అంశంలో వివాదం జరిగిందన్నది తెలియడం లేదు..