ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు యూపీ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యానాథ్ ప్రమాణం స్వీకారం..!!!

యూపీ ఎన్నికల్లో భారీ గెలుపు సాధించిన యోగీ ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 403 స్థానాల్లో 273 ఎమ్మెల్యే సీట్లు సాధించిన బీజేపీ రెండోసారి అధికారంలోకి రానుంది. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు యూపీ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యానాథ్ ప్రమాణం స్వీకారం అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు అవుతారని తెలుస్తోంది…సీఎం యోగీ ప్రమాణస్వీకారాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేస్తోంది. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగనుంది. 50వేలమంది సామర్థ్యం గల ఈ స్టేడియంలో దాదాపు 200 మంది వీవీఐపీలకు ఏర్పాట్లు చేస్తున్నారు…