కొబ్బరి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు..

కొబ్బరి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటొ తెలుసుకుందాం ఇప్పుడు..
శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
డయాబెటీసను తగ్గిస్తుంది
కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గిస్తుంది –
గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది
రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది
చాలాసేపు వ్యాయామం తర్వాత తాగితే శరీరం
హైడ్రేటెడ్ గా ఉంటుంది
వేసవి వస్తుంది కాబట్టి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు తాగండి…

మిగతా వాటితో పోల్చి చూస్తే కొబ్బరి నీళ్ల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలం ఆ కాలం అనే తేడాల్లేకుండా అన్ని కాలాల్లోనూ లభించే కొబ్బరి బోండాల ద్వారా వచ్చే కొబ్బరి నీళ్లు అనేక రోగాలను నయం చేయడంలో సహాయపడతాయి. కల్తీకి ఆస్కారం లేని కొబ్బరి నీళ్లు సర్వ రోగ నివారిణిగా పని చేస్తాయి…చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యల్లతో పోల్చి చూస్తే రక్తపోటు విషయంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. బీపీతో బాధ పడుతున్న వాళ్లు ప్రతిరోజూ కొబ్బరినీళ్లను తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. షుగర్ తో బాధ పడేవాళ్లు సైతం కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చు. అయితే వీళ్లు లేత కొబ్బరితో పోలిస్తే ముదిరిన కొబ్బరి ఉన్న కొబ్బరి బోండాల్లోని నీళ్లను తాగితే మంచిది…కూల్ డ్రింగ్స్, మద్యం తాగే బదులు కొబ్బరి నీళ్లు తాగితే… ఆరోగ్యమే ఆరోగ్యం. ఇవి గుండెను కాపాడేస్తాయి. బాడీలో హీట్ తగ్గిస్తాయి. దాహం సమస్యను చెక్ పెడతాయి. ఈ నీళ్లు ఎన్ని తాగినా శరీరంలో కొవ్వు పెద్దగా ఏర్పడదు. అందుకే అంటారు ఒక కొబ్బరిబోండాం, ఒక సెలైన్ బాటిల్‌తో సమానం అని. రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత రావడంతో గాయపడినవారికి కొబ్బరి బోండాలనే ఇచ్చారు. లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వందేళ్ల కిందటి వరకూ డబ్బు బదులు కొబ్బరి బోండాలు ఇచ్చుకునేవాళ్లు. మాల్దీవుల జాతీయ వృక్షం కొబ్బరి చెట్టు. ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే… సెప్టెంబర్‌ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవం (World Coconut Day)గా ప్రకటించారు.