బహిరంగ ప్రదేశాల్లో టాలీవుడ్ హీరోయిన్ కలర్ స్వాతి..

టాలీవుడ్ హీరోయిన్ కలర్ స్వాతి యాంకర్‌గా అందరికీ పరిచయం అయింది. ఆ తర్వాత ‘అష్టాచమ్మా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హీరో నిఖిల్‌తో స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే కలర్ స్వాతి భర్తతో విడాకులు తీసుకుంటుందని పలు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ కపుల్స్ సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో అందరూ అనుమానపడ్డారు.ఇదిలా ఉంటే.. తాజాగా, స్వాతి బుర్ఖా ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో బుర్ఖా ధరించి అటు ఇటు తిరుగుతూ కనిపించింది. ఇందంతా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సరదాగా చేసినట్లు తెలుస్తోంది. ట్రైన్ ఎక్కిన తర్వాత బుర్ఖా తీసేసి నార్మల్‌గా కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.