త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్: సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణలో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. వయో పరిమితి 46 ఏళ్లకు పెంచనున్నామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలిచ్చామని, మరో 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిరాక్స్ సెంటర్లలో, టిఫిన్ సెంటర్లలో పరీక్షా పత్రాలు దొరికాయని.. తమ ప్రభుత్వంలో అలా జరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

*బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ కౌంటర్లు*

అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్రెడ్డి కౌంటర్లిచ్చారు. “తెలంగాణ రాజకీయాల్లో నటులకు కొదవలేదు. ఒక ఆటో రాముడు.. ఆటోలోపల కెమెరాలు పెట్టుకుని.. ఆటోలో ప్రయాణించాడు. మరో నటుడు రూ.100 పెట్టుకుని కిరోసిన్ కొనుక్కున్నాడు.. కానీ, అర్ధ రూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు” అని అన్నారు. ఇవి కేటీఆర్, హరీశ్రవులను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారని నెటిజన్లు అంటున్నారు..!