కామన్‌వెల్త్ క్రీడలకు ముందు భారత్‌కు షాక్ .డోప్‌ టెస్టులో పట్టుబడ్డ స్టార్‌ అథ్లెట్‌లు..!..!!

కామన్‌వెల్త్ క్రీడలకు ముందు భారత్‌కు షాక్ తగిలింది. ఇద్దరు టాప్ అథ్లెట్లు డోపింగ్ టెస్టులో ఫెయిలయ్యారు…

బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022కు ముందు భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. భారత స్టార్‌ స్ప్రింటర్ ధనలక్ష్మి, ట్రిపుల్‌ జంపర్‌ ఐశ్వర్యబాబు డోప్‌ టెస్టులో పట్టుబడ్డారు…

వారిలో స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి ఒకరు కాగా, స్టార్ ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యా బాబు మరొకరు. వీళ్లిద్దరూ డోపింగ్ టెస్టులో ఫెయిలవడంతో బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనడం లేదని సమాచారం…

భారత అథ్లెటిక్స్ బృందంలో ఉన్న వీళ్లిద్దరూ కూడా కామన్‌వెల్త్ క్రీడలకు దూరమైనట్లే. ధనలక్ష్మికి విదేశాల్లో అథ్లెటిక్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సమాచారం. కామన్‌వెల్త్ క్రీడల్లో స్ప్రింటర్ ధనలక్ష్మి 100 మీటర్ల పరుగు పందెంతోపాటు 4×100 మీటర్ల రిలే రేస్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది.

అదే సమయంలో నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా సేకరించిన ఐశ్వర్య శాంపిల్స్ కూడా పాజిటివ్ ఫలితాన్నిచ్చినట్లు నాడా అధికారులు తెలిపారు. దీంతో వీళ్లిద్దరూ కూడా కామన్‌వెల్త్ క్రీడలకూ దూరం కానున్నారు.