ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ కండోమ్ రాజకీయాలు!.

రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు విభిన్నంగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏపీలో తెలియని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం మరియు అధికార వైసిపి పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. ఈ రెండు పార్టీల మధ్య ఎప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది. తమ పార్టీల కోసం ప్రాణాలు కూడా అర్పించే నాయకులు అలాగే కార్యకర్తలు ఉంటారు. తమ నాయకుడిని గెలిపించుకునేందుకు ఎక్కడికైనా వెళ్తారు.Tdp Vs Ycp..

ఎంతకైనా తెగిస్తారు. అయితే అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో… అందరూ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ… ప్రచారంపై దృష్టి పెట్టాయి. వచ్చిన ఏ ఛాన్స్ ను కూడా… ఏ ఒక్క రాజకీయ పార్టీ వదులుకోవడం లేదు. ప్రతినిత్యం జనాలకు దగ్గర ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు. వినూత్నమైన రీతిలో ప్రచారాలు కొనసాగిస్తున్నాయి..
ఏకంగా కండోమ్ ప్యాకెట్ల తో ప్రచారాన్ని జోరందించాయి పార్టీలు. నిరాహార ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలను దాటి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత దిగజారిపోయాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో… ఆయా పార్టీలు మరీ చీప్ గా ప్రవర్తిస్తున్నాయి…
ముఖ్యంగా వైసిపి మరియు టిడిపి పార్టీలు పూర్తిగా దిగజారిపోయాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టిడిపి నేతలు కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారు. సిద్ధం సభల పేరుతో వైసిపి నాయకులు కాండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ… సోషల్ మీడియాలో ఇరు పార్టీలు పోస్టులు పెడుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ… చిల్లర ప్రచారానికి తెర లేపాయి వైసిపి మరియు తెలుగుదేశం పార్టీ లు. దీంతో ఏపీ రాజకీయాలు పూర్తిగా దిగజారాయాయని సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు..