కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో చలో ఈడీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు పిలుపు..!!

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో ఈ నెల 13న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు విచారణకు హాజరవుతున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ చలో ఈడీ కార్యాలయానికి పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టనుంది. దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణ పూర్తయి తిరిగి ఆయన బయటకు వచ్చేంత వరకు ఇక్కడ ఈడీ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కొనసాగించనున్నారు. ఈ ప్రదర్శనలో పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని సంఘీభావం తెలియచేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.