కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..!!

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. సోనియా గాంధీ సూచనలతో ఎస్సీ, ఎస్టీ డిక్లకేషన్‌ ప్రకటిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంపు

అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్

ప్రైవేట్ విద్యా సంస్థల్లో, ప్రైవేట్ కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం..

అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామన్నారు. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుగా గద్దర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లకేషన్‌ ప్రకటిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.