ఉమ్మడి నల్గొండ జిల్లాలో BRS పార్టీ నాయకులను ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

కాంగ్రెస్ నేతల మధ్య మాటల వార్ ముదురుతోంది. సినిమా రేంజ్ లో డైలాగ్స్ వదులుతూ..ఎక్కడ తగ్గేదెలా అంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవరని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని కేటీఆర్ కు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ సవాల్ విసిరారు…

https://youtube.com/shorts/ipn94sZvz-8?si=Nb1cE3wdZjUEfpDN

*నల్గొండలో ఒక్కడిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను.*

*నేను కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుండి ఒక్కొక్కడు ప్యాంట్లో ఉచ్చ పోసుకుంటున్నారు కొడుకులు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.*.

బహిరంగ సభల్లో తమదైన ఉపన్యాసాలతో అభ్యర్థులు, కీలక నేతలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థులపై పంచు డైలాగులు, సవాళ్లతో పాటు కొన్ని ఘాటైన విమర్శలు కూడా సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. కొంత మంది నేతలు కొన్ని మాటలు తూలుతున్నారు. పరుష పదజాలంతో ఘాటు విమర్శలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉండగా.. అదే పార్టీకి చెందిన మిగతా నేతలు కూడా పలు సందర్భాల్లో మాటలు వదిలేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనో.. ప్రత్యర్థులను రెచ్చగొట్టాలన్న లక్ష్యమో కానీ.. కొన్ని ఉద్రేకమైన మాటలు వదిలేస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోం డి…