కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో కుదిరిన పొత్తు..

కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో కుదిరిన పొత్తు

సిపిఐకి రెండు స్థానాలు, సిపిఎంకి రెండు స్థానాలు ఇచ్చిన కాంగ్రెస్.

సిపిఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు.
సిపిఎంకి భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు ఖరారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. సీపీఎం, సీపీఐ పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆయా పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సీపీఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ నియోజక వర్గ టికెట్లు ఖరారు చేయగా.. సీపీఐ పార్టీకి కొత్తగూడెం, మునుగోడు సీట్లను కేటాయించారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ కన్ఫార్మ్ అయింది. పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. పొదెం వీరయ్యను పినపాకకు పాంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. భట్టి విక్రమార్క ద్వారా సీపీఎం, సీపీఐ బలాబలాలపై కాంగ్రెస్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో లెఫ్ట్ పార్టీల ప్రభావం కలిసి వస్తుందనే రిపోర్ట్ రాగా.. వారితో పొత్తుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది…!