కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు…రేవంత్ కు రాజకీయ ఝలక్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు…

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

చంద్రబాబు, రేవంత్ కు సరైన స్థాయిలో రాజకీయ శిక్షణ ఇవ్వలేదు..

నా పంచాయతీ పిసిసి రేవంత్ రెడ్డి తోనే పార్టీతో కాదు...

తన పంచాయితీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని.రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలన్నారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడతానన్నారు. తనతో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడట్లేదన్నారు. తనతో మాట్లాడేందుకు నేతలు భయపడుతున్నారని అన్నారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అన్నందుకు నొచ్చుకుని ఉంటారని.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు…

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు….కాంగ్రెస్ పార్టీలోని నేతలందరినీ కలుపుకుపోయే తత్వం రేవంత్ కు లేదన్నారు. ఆయన ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని మండిపడ్డారు. తనకు కాంగ్రెస్, సోనియా, రాహుల్ కుటుంబంతో ఇబ్బంది లేదన్నారు. తనకు రేవంత్ కు మధ్యనే పంచాయితీ ఉందన్నారు. ఇటీవల రేవంత్ మెదక్ వెళ్తున్న సందర్భంలో తనకు ఫోన్ చేసి వెళ్తున్నా అని సమాచారం మాత్రమే ఇచ్చారని..రమ్మని పిలవలేదన్నారు. దామోదర రాజనర్సింహకి ఫోన్ చేసి మెదక్ కి రమ్మని రేవంత్ పిలిచారని..దాంతో తాను మనస్థాపానికి గురైయ్యానని చెప్పారు.

రాజకీయంగా కేసీఆర్ తో ఎలాంటి గొడవలు లేవన్నారు జగ్గారెడ్డి. తాను పీసీసీ కావాలని కోరుకున్నానని చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానని..అందుకే కొందరు సీనియర్లు తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని..తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. రేవంత్ కు రాజకీయ ఝలక్ ఎలా ఇవ్వాలో తనకు బాగా తెలుసన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనను బుజ్జగించినట్లు ప్రచారం చేశారని..అందంతా పచ్చి బూటకమన్నారు. సీఎల్పీ మీటింగ్ తర్వాత ఒంటరిగా గదిలోకి పిలిపించుకుని సీఎం సీరియస్ గా ఉన్నారని..ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని చెప్పారని తెలిపారు… సీఎంకు సీరియస్ గా ఉంటే అసెంబ్లీ నడుస్తదా అని ప్రశ్నించారు.
టిడిపి అధినేత చంద్రబాబు, రేవంత్ కు సరైన స్థాయిలో రాజకీయ శిక్షణ ఇవ్వలేదన్నారు