బషీర్ బాగ్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన ర్యాలీ…

శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టి ఈడీ నోటీసులు, విచారణ పేరుతో వేదించడం ముమ్మాటికీ కక్ష సాధింపే…
దానికి నిరసనగా హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్డు నుండి బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీ…
తెలంగాణలో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్​ తలపెట్టిన ర్యాలీ జరిగింది. ఇందుకు పోలీసులు అనుమతించారు. ఆ నిరసనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బషీర్‌​బాగ్​ ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ర్యాలీ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.

ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, చింతల్ బస్తీ, లక్డీ క పూల్, బషీర్ బాగ్​, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సెక్రెటేరియట్ మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాస్కి, జగ్గారెడ్డి సహా అందరు కాంగ్రెస్ నేతలు నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నల్ల బట్టలు, నల్ల కండువాలు ధరించారు. జగ్గారెడ్డి ఏకంగా సోనియా గాంధీ విగ్రహం ఎక్కి నిరసన తెలిపారు. వీరంతా అక్కడ నుంచి బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు…