200. యూనిట్స్ కరెంట్, రూ.500కే సిలిండర్: సీఎం రేవంత్ రెడ్డి..

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. వచ్చేనెల 15వ తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు….