కాంగ్రెస్ ను ఓడించాలని రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు.. సీఎం రేవంత్ రెడ్డి..!

పాలమూరులో కాంగ్రెస్ ను ఓడిస్తే రాష్ట్రంలో పార్టీని బలహీనపర్చాలనే కుట్రతో బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.పాలమూరులో దేని కోసం కాంగ్రెస్ ను ఓడిస్తారని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నేతలను సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల లాంటి వారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు.గద్వాల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయం సాధించకుండా పరోక్షంగా బీజేపీ సహకరించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు జిల్లాలోని వాల్మీకి, బోయల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వాల్మీకి, బోయలకు ప్రభుత్వంలో మంచి బాధ్యతలను అప్పగిస్తామన్నారు.అంతేకాదు కష్టపడేవారికి ప్రభుత్వంలో మంచి పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో మంచి బాధ్యతలను అప్పగిస్తామన్నారు.