కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ ఎంపీ వెంకటేష్…

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలింది. పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్వంలో ఇవాళ ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కండువా కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు..

అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, హస్తం పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అందరి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొంతమంది వెంకటేష్ అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ తరుణంలో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.