నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీ హామీ పథకాలు..!

*BREAKING NEWS*

హైదరాబాద్

*నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీ హామీ పథకాలు*

1) మహాలక్ష్మి పథకం:- కుటుంబంలో మహిళకు నెలకు 2500 రూపాయల నగదు, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్.

2) రైతు భరోసా పథకం:- ఎకరాకు 15 వేల రూపాయల పెట్టుబడి ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్, వ్యవసాయ కూలీలకు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం.

3) గృహ జ్యోతి పథకం:- గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు.

4) ఇందిరమ్మ ఇంటి పథకం:-
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం.

5) యువ వికాస పథకం:- విద్యార్థులకు ఐదు లక్షలతో విద్య భరోసా కార్డు.

6) చేయూత పెన్షన్:- ఆసరా పెన్షన్ 4000 రూపాయలకు పెంపు.

*క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి హామీల అమలు*

కర్ణాటకలో ఎలా అయితే ఇస్తున్నాము ఇక్కడ కూడా కచ్చితంగా అమలు చేస్తాం…

బిజెపి టీఆర్ఎస్ ఎంఐఎం మూడు పార్టీలు ఒకటే…
గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలోని పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఇస్తారు. కౌలు రైతుకి కూడా అంతే ఇస్తారు. రైతు కూలీలకు ఏడాది రూ.12,000 అందుతాయి.

యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందిస్తారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తారు. చేయూత పెన్షన్‌ పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున అందిస్తారు. అలాగే, రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తారు..