కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు…

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు.. పార్టీకి మరో నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అంబర్‌పేటలోని తన నివాసంలో ఆయన ప్రెస్‌ మిట్నిర్వహించారు.

ఎన్నికల్లో టికెట్‌ దక్కుతుందని ఆశించిన వారికి.. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హస్తం పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేయగా.. మరికొందరు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు.. పార్టీకి మరో నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు..కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను బయటకు వెళ్లొగొట్టేందుకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. అంబర్‌పేట వెంట పడుతున్నారన్న వీహెచ్‌.. ఆ సీటు తనదేనని.. ఇక్కడ వేలు పెడితే బాగోదన్న వీహెచ్‌.. అంబర్‌పేట వెంట పడితే.. తాను ఉత్తమ్‌ వెంట హెచ్చరించారు. అంబర్‌పేట నుంచి గెలిచి తాను మంత్రినయ్యానని గుర్తు చేసుకున్నారు. గతంలో తనపై కేసులు పెట్టిన నూతి శ్రీనివాస్‌గౌడ్‌ను తనపైకి ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు…