రియల్ హీరో.. మునిగిపోతున్న యువతిని కాపాడిన కానిస్టేబుల్
30 అడుగుల లోతైన చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయిన ఓ యువతి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంది.
చెరువు ఎంతో లోతుగా ఉండటంతో అక్కడున్న యువకులు భయంతో నీటిలోకి దిగేందుకు సాహసం చేయలేకపోయారు. యువతి సహాయం కోసం అరుస్తుండగా, అక్కడి నుంచి బైక్పై పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్ దీపక్ సోలంకి ఆ కేకలు విని వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాడు.
యువతి నీటిలో మునిగిపోతున్న పరిస్థితిని గమనించిన దీపక్, తన ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా యూనిఫామ్తోనే చెరువులోకి దూకాడు. అప్రమత్తంగా వ్యవహరించి యువతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాడు.
తన విధి నిర్వహణలో భాగంగా కాకుండా, మానవత్వంతో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దీపక్ సోలంకిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.