కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజ్ కు సీఎం ఆదేశాలు.!!

జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇందుకోసం 2016లోనే జీవోను జారీ చేసినా.. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. విచారణ తర్వాత గత నెల 20న తీర్పును వెలువడడంతో లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే కాంట్రాక్ట్ లెక్చరర్ల జాబితా కూడా ప్రభుత్వానికి చేరడంతో ప్రక్రియను ప్రారంభించనున్నారు.