బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు…

ఆంధ్రా..

బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి.

దీనికితోడు కోస్తా రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడంతో వాతావరణం వేడెక్కింది.

దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో అక్కడక్కడా మేఘాలు ఆవరించాయి.

ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..