చైనా కంపెనీ ఐస్ క్రీమ్ లో కరోనా…

కరోనా నుంచి బయటపడేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత కరోనా తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, కరోనా వైరస్ కు మూలమైన చైనాలో వైరస్ కేసులు తిరిగి నమోదవుతున్నాయి. అయితే, ఈ వైరస్ మనుషుల్లోని కాకుండా ఐస్ క్రీమ్ లో కూడా బయటపడింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఉత్తర చైనాలోని టియాంజిన్ డాకియోగావో ఫుడ్ ఉత్పత్తి కంపెనీ ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసిన ఐస్ క్రీమ్ లలో కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించారు. ఐస్ క్రీమ్ లలో కరోనా వైరస్ లను గుర్తించడంతో కంపెనీ అప్రమత్తం అయ్యింది. ఐస్ క్రీమ్ కంపెనీలో తయారు చేస్తున్న 1662 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరందరిని క్వారంటైన్ లో ఉంచారు. ఇందులో 700 మందికి నెగెటివ్ గా నిర్ధారణ జరిగింది. 962 మంది ఉద్యోగులకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని టియాంజిన్ డాకియోగావో ఫుడ్ కంపెనీ తెలియజేసింది. ..చైనా కంపెనీ ఐస్ క్రీమ్ లో కరోనా…ఐస్‌క్రీమ్ శాంపిల్స్‌లో కరోనా వైరస్ ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు.