కొత్త ర‌కం క‌రోనా కేసులు ఆ దేశాన్ని అత‌లాకుతలం చేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 126 రకాల కరోనా వేరియంట్స్..మన దేశంలో 19 రకాలు..

బ్రిట‌న్‌లో వెలుగుచూసిన కొత్త ర‌కం క‌రోనా కేసులు ఆ దేశాన్ని అత‌లాకుతలం చేస్తున్నాయి. కొత్త‌ర‌కం స్ట్రెయిన్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్న త‌రుణంలో, ఇంగ్లాండ్ దేశంలో లాక్‌డౌన్ విధించారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వ‌ర‌కు లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుంది. బ్రిట‌న్లో మొద‌లైన ఈ కొత్త‌ర‌కం క‌రోనా కేసులు, అక్క‌డి నుంచి ఇత‌ర దేశాల‌కు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే దాదాపుగా 50 దేశాల‌కు కొత్త స్ట్రెయిన్ వ్యాపించింది. ఇండియాలో కూడా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 116 కేసుల‌ను గుర్తించారు. ఇండియాలో ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. ఇక పాజిటీవ్ కేసులు వ‌చ్చిన వ్య‌క్తుల‌ను ప్ర‌త్యేక గ‌దుల‌లో ఉంచి ప‌రిశీలిస్తున్న‌ట్టు వైద్యాధికారులు తెలిపారు. వేషం మారుస్తున్న మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 126 రకాల కరోనా వేరియంట్స్..మన దేశంలో 19 రకాలు..ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 126 రకాల కరోనా వేరియంట్స్‌ను సైంటిస్టులు గుర్తించారు. మన దేశంలో 19 రకాల వైరస్‌లున్నట్లు తేల్చారు..దీంతో మన దేశంలో కొత్త టెన్షన్ మొదలైంది. వేషం మారుస్తున్న ఆ మహమ్మారిపై విస్త్రుతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడున్న వ్యాక్సిన్స్‌ ఈ న్యూ స్ట్రెయిన్స్‌ను ఎదుర్కొంటాయా.. అనే అంశంపై ప్రయోగాలు కూడా చేేపట్టారు.