వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం..

దేశంలోని 3351 కేంద్రాల్లో వ్యాక్సిన్ ను అందించారు. తొలిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని చూసినా, ఆ సంఖ్య తక్కువగానే నమోదైంది. వ్యాక్సిన్ అపోహలు, పండగ రోజులు కావడంతో సమయానికి అందుబాటులో ఉండకపోవడం వంటి కారణాల వలన తొలిరోజు వ్యాక్సినేషన్ సంఖ్య తగ్గింది. ఇక ఇదిలా ఉంటె, తొలిరోజు 1,91,181 మందికి వ్యాక్సిన్ అందిస్తే, అందులో ఢిల్లీలో 52 మందికి, మహారాష్ట్రలో 14, పశ్చిమ బెంగాల్ లో 14, రాజస్థాన్ లో 21, తెలంగాణలో 11 మందికి స్వల్ప సైడ్ ఎఫక్ట్స్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వ్యాక్సిన్ అందించిన తరువాత అరగంట సమయంపాటు పరిశీలనలో ఉంచుతారు. అరగంట సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే వారిని ఇంటికి పంపిస్తారు. దేశం మొత్తం మీద ఒకరు ఆసుపత్రిలో జాయిన్ అయ్యినట్టు అధికారులు తెలిపారు. తొలిరోజు నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.