రెండో దశలో తొలిరోజు ప్రధాని, సీఎంలకు టీకాలు…!

వ్యాక్సినేషన్​పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రధాని సహా దేశవ్యాప్తంగా ముఖ్య నేతలకు రెండోదశలో కొవిడ్ టీకాలు వేస్తామని పేర్కొంది. తొలి దశ వ్యాక్సినేషన్‌లో 3 కోట్ల మందికి కొవిడ్ టీకాలు వేయాలని నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు 7లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడించింది.
రెండో దశలో తొలిరోజు ప్రధాని, సీఎంలకు టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 50 ఏళ్లు పైబడిన వారితో పాటుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీకాలు వేస్తామని చెప్పింది. ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది…