అగ్ని ప్రమాదంతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ ఉండదు : సీరమ్
పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ లో సంభవించిన అగ్ని ప్రమాదంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ లేదని సంస్థ ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. 4,5 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని ‘మంజరీ’ అని పిలుస్తారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే ప్రదేశం నుంచి కాస్త దూరంలో ఉంటుంది. మొదట్లో కేవలం 5 ఫైర్ ఇంజన్లు మాత్రమే వచ్చాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో ఐదు ఫైర్ ఇంజన్లను అధికారులు రప్పించారు….