లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరోగ్య మరియు అంగన్వాడీ సిబ్బంది కి covid 19 వాక్సిన్ టీకా..

టీకా పై సందేహాలు వద్దు….
కరోనా వ్యాక్సిన్ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈరోజు ఆరోగ్య సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది కి covid 19 వాక్సిన్ అందించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా పై ఎవరు సందేహించాల్సిన అవసరం లేదని వ్యాక్సిన్ భద్రతపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వవద్దని వాక్సిన్ పూర్తిగా సురక్షితం అని తెలియజేశారు. గత రెండు రోజులుగా హుజూర్నగర్ మండల పరిధిలో వాక్సిన్ తీసుకున్న వారిలో గుర్తించదగిన దుష్పరిణామాలు ఏమీ లేవని తెలియజేశారు. రెండవ రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లింగగిరి నందు…..68.. ఏరియా హాస్పిటల్నందు 16 హుజూర్ నగర్ మండల పరిధి లో మొత్తం 84మందికి టీకా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో C. D. P. O విజయలక్ష్మి, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, మంగమ్మ, అలివేలు మంగ, మాధవి, సంతోషం, ఉపేందర్ ఆశ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.