రాజ్‌కోట్‌లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుండగా… మరోసారి పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం…

కరోనావైరస్ తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇప్పటికే గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుండగా… మరోసారి పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నాలుగు నగరాల్లోనూ ఫిబ్రవరి 15వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని గుజరాత్ సర్కార్ తెలిపింది. దీంతో.. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ సిటీల్లో యథావిథిగా రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్య కర్ఫ్యూ అమల్లో ఉండబోతోంది. గుజరాత్‌లో కరోనా రికవరీ రేటు 96.94 శాతంగా ఉందని.. అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నైట్ కర్ఫ్యూ పొడిగిసతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, కర్ఫ్యూ సమయంలో.. అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంటుంది. అయితే, గుజరాత్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2.60 లక్షలు దాటిపోగా.. ప్రస్తుతం 3,589 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు అక్కడ 4,385 మంతి మృతిచెందినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది..